VIDEO: అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై మాట్లాడాలి: ఇన్‌ఛార్జ్
KRNL: ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే విరూపాక్షి అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై మాట్లాడాలని టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి కోరారు. శనివారం ఆలూరు పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే విరూపాక్షి అబద్ధపు మాటలు మాట్లాడటం ఆపేసి, గ్రామాలలో పర్యటించి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తెలుసుకోవాలని సూచించారు.