ఎక్సైజ్ అధికారుల దాడులు

ELR: చాట్రాయి మండలం మంకొల్లు గ్రామంలో ఉన్న సారా శిబిరంపై శుక్రవారం దాడులు నిర్వహించినట్లు జిల్లా అసిస్టెంట్ ప్రొఫెషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిహెచ్ అజయ్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ దాడులలో సారా తయారీకి వినియోగించే నాలుగు వందల లీటర్ల పులిసిన బెల్లపు ఊట ధ్వంసం చేశామన్నారు. నేరానికి సంబంధించి ధరావతు భాస్కరరావు పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.