హోటల్స్‌పై పౌరసరఫరాల శాఖ మెరుపు దాడులు

హోటల్స్‌పై పౌరసరఫరాల శాఖ మెరుపు దాడులు

GNTR: ప్రత్తిపాడులోని లక్ష్మీదుర్గ హోటల్‌పై పౌరసరఫరాల శాఖ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా హోటల్‌లో వాడుతున్న రెండు గృహ వినియోగ సిలిండర్లను సీజ్ చేశారు. డిప్యూటీ తహశీల్దార్ శివశంకర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. వాణిజ్య అవసరాలకు వాడినందుకు హోటల్ నిర్వాహకులపై 6A కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.