విద్యుత్ షాక్‌తో.. ఎద్దు మృతి

విద్యుత్ షాక్‌తో.. ఎద్దు మృతి

BHPL: భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం అన్సాన్ పల్లి గ్రామానికి చెందిన జాటోత్ సారయ్యకు చెందిన ఎద్దు శనివారం ఉదయం ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందింది. సాగులో ఎంతో చేదోడు వాదోడుగా ఉండే ఎద్దు మృతి చెందడం పట్ల రైతు సారయ్య తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. సదరు ఎద్దు సుమారు రూ. 60 వేలు ఉంటుందని ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని రైతు కోరారు.