రాణీపేటలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన

MBNR: మిడ్జిల్ మండలం రాణి పేట, వేముల గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా మంజూరైన లబ్ధిదారులను మండల ఇంఛార్జ్ ఎంపీవో ఆనంద్ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ సుదర్శన్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మల్లేశ్, జాఫర్, మైసయ్య, కామూన్, అంజమ్మ, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.