VIDEO: కలెక్టరేట్ ముందు గీత కార్మికుల నిరసన

VIDEO: కలెక్టరేట్ ముందు గీత కార్మికుల నిరసన

JN: గీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని గీత కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. కల్లు గీత కార్పొరేషన్ కు 5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, 50 ఏళ్లు పైబడిన కార్మికులకు 4 వేల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాని కోరారు. అనంతరం తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.