'భూ చట్టాల పట్ల పోలీసులు అవగాహన కలిగి ఉండాలి'
KMM: భూ వివాదాలు, భూ చట్టాల పట్ల పోలీసు అధికారులు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఐపీఎస్ ట్రైనీ అభ్యర్థులకు భూ వివాదాలు, శాంతి భద్రతల నిర్వహణపై ఆయన అవగాహన కల్పించారు.