రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు
WGL: వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో మంగళవారం స్ఫూర్తి జ్యోతి యూత్ సభ్యుల ముందడుగుతో గ్రామ ప్రజల సౌకర్యం కోసం రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయబడింది. పంచాయతీ దగ్గర మాత్రమే బస్ ఆగడం వల్ల స్కూలు పిల్లలు, వృద్ధులు, వ్యాపారులు కష్టపడ్డారని తెలిపారు. సర్పంచ్ సునీత రాజేష్ ఆధ్వర్యంలో, డిపో మేనేజర్ సమన్వయంతో బస్ స్టాప్ బోర్డ్ ఏర్పాటు చేశారు.