నంద్యాలలో ఈనెల 17న జిల్లా స్థాయి చెస్ పోటీలు
NDL: జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈనెల 17న జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు క్రీడాధికారి రాజు తెలిపారు. ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఇక్కడ ప్రతిభ చాటిన క్రీడాకారులు ఈనెల 21, 22 తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారు. ఆసక్తి గల వారు వెబ్‌సైట్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలన్నారు.