సర్దార్ సర్వాయి పాపన్నకు ఘన నివాళి

MDK: నర్సాపూర్ మండల కేంద్రంలో సోమవారం బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పలు నాయకులు, గౌడ సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేసిన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు.