ఆత్మీయ అభినందన సత్కార సభ

NZB: నూతనంగా ఏర్పడిన బాల్కొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మౌలిక వసతులు కల్పించిన దాతలను మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ వేణు ప్రసాద్ మాట్లాడుతూ.. కళాశాలకు ఫర్నిచర్ అందించిన దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి ప్రిన్సిపల్ రాజ్ కుమార్, అధ్యాపకులు రాజ్ కుమార్, దయానంద ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.