ఈనెల 23న వాలీబాల్ ఎంపిక పోటీలు

ఈనెల 23న వాలీబాల్ ఎంపిక పోటీలు

ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈనెల 23న ఉమ్మడి జిల్లా స్థాయి జూనియర్ బాలబాలికల వాలీబాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల శంకర్, ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2008 జనవరి 1 తరువాత జన్మించిన వారు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. వివరాలకు 9959701878 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.