డీసీఎం ఢీకొని గొర్రెలు మృతి

డీసీఎం ఢీకొని  గొర్రెలు మృతి

నల్గొండ పట్టణంలోని అద్దంకి బైపాస్‌లో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 గొర్రెలు మృతి చెందాయి. మరో 5 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద బండ నుంచి గొర్రెలను మేపుకుంటూ అద్దంకి బైపాస్ దాటుతుండగా, హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వేగంగా వస్తున్న డీసీఎం వాహనం గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ఘటనతో గొర్రెల కాపరి మన్నెం కోటిలింగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.