10వ తరగతి విద్యార్థిని మృతి

CTR: ఈ ఘటన చౌడేపల్లె మండలం కేతనపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యం, గంగులమ్మ కుమార్తె రెడ్డీశ్వరి(15) 10వ తరగతి చదువుతోంది. శుక్రవారం రాత్రి కడుపు నొప్పి రావడంతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందింది. కుమార్తె కోల్పోవడంతో తల్లిదండ్రులు, బంధువులు, తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు.