నేడు నీటి సరఫరాలో అంతరాయం
MDK: జిల్లా కేంద్రంలో ఇవాళ నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని పురపాలిక కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సింగూరు నుంచి పట్టణానికి నీటిని సరఫరా చేసే 90 ఎంఎల్డీ పైపులైన్ నిర్వహణ పనులు చేపడుతున్నందున అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. పట్టణవాసులకు ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా ట్యాంకర్లను అందుబాటులో ఉంచనున్నారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజలు గమనించి సహకరించాలని ఆయన కోరారు.