అభివృద్ధికి రాజకీయాలతో ముడి పెట్టవద్దు: CM
ADB: ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని, అభివృద్ధి విషయంలో కలిసికట్టుగా పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. గతంలో పరిపాలించిన పార్టీలు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రజాపాలనలో అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్లడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.