పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా విడుదల
WGL:తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మేరకు ముసాయిదా జాబితా విడుదలైంది. వర్ధన్నపేట పట్టణంలోని 12 వార్డులకు సంబంధించిన 20 పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను సిద్ధం చేసి ఆర్డీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం నోటిస్ బోర్డులపై ప్రచురించారు. ప్రజలు పరిశీలించుకోవాలని మున్సిపల్ కమిషనర్ సుధీర్ కుమార్ మంగళవారం తెలిపారు.