డ్రగ్స్ అమ్ముతున్న మహిళ అరెస్ట్

ప్రకాశం: డ్రగ్స్ విక్రయిస్తూ తప్పించుకు తిరుగుతున్న మహిళను వెదుళ్లపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. విజయలక్ష్మి యువకులకు డ్రగ్స్ బిల్లలు విక్రయిస్తూ పోలీసుల కళ్లు కప్పి తిరుగుతుండగా సోమవారం అరెస్ట్ చేశామన్నారు. స్టువర్టుపురం గ్రామంలోని ఓ ఇంట్లో ఉన్నట్లు సమాచారం రావడంతో.. ఆమెను అదుపులోకి తీసుకొని, కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు ఎస్సై భాగ్యరాజ్ తెలిపారు.