మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజల ఇబ్బందులు

మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజల ఇబ్బందులు

NLG: వేములపల్లి మండల కేంద్రంలో 5 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు సరఫరా లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. మిషన్ భగీరథ పైపులు లీక్ కావడంతో గ్రామపంచాయతీ ట్యాంకర్లతో వచ్చే నీరు సరిపోవడం లేదని, కనీస అవసరాలకు నీళ్లు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.