నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

PPM: సాలూరులో ఈ నెల 18 నుండి 20 వరకు జరగనున్న శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగలో విద్యుత్‌ అసౌకర్యం లేకుండా ఉండేందుకు 33 కేవీ మెయింటెనెన్స్‌ పనులు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపి వేస్తున్నట్లు AE భాస్కరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సాలూరు, నెలిపర్తి కూర్మరాజుపేట, శివరాపురంలో విద్యుత్ ఉండదన్నారు.