10 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

KMM: తిరుమలయపాలెం మండలం ముజాహిదీపురం, కాకరవాయి పాలేరు వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఎస్సై జగదీష్ 10 ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేశారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పాలేరు వాగు సమీప గ్రామాల ప్రజలకు అక్రమంగా ఇసుక రవాణా చేయడంపై అవగాహన కల్పించారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే సమాచారం అందించాలని సూచించారు.