తుఫాన్ బాధితులకు నిత్యవసరాలను అందించిన ఎమ్మెల్యే
KKD: ‘మొంథా' తుఫాను బాధితులకు ఎమ్మెల్యే యనమల దివ్య గురువారం నిత్యావసర సరుకులను అందజేశారు. తుని కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండల తహశీల్దార్ జి.వి.ఎస్.ప్రసాద్ అధ్యక్షత వహించారు. బాధిత కుటుంబాలకు బియ్యం, ఇతర సరుకులను ఎమ్మెల్యే స్వయంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ నార్ల భవన సుందరి, నాయకులు యనమల రాజేశ్ పాల్గొన్నారు.