VIDEO: అసెంబ్లీకి వెళ్లే రోడ్డు గుంతలమయం
GNT: తుళ్లూరు మండలం రాయపూడి వద్ద అసెంబ్లీకి వెళ్లే రహదారి గుంతలమయంగా మారిందని స్థానికులు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ రోడ్లకు మరమ్మతులు చేపట్టకపోవడంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు స్పందించాలని కోరారు.