VIDEO: రైతుపై దాడి.. తీవ్ర గాయాలు
అన్నమయ్య: నిమ్మనపల్లెలో శుక్రవారం సాయంత్రం వెంకోజి గారిపల్లికి చెందిన రైతు వెంకటరమణ(59)పై ప్రత్యర్థులు కర్రలతో దాడి చేశారు. తన ఇంటి ముందు మట్టి దిబ్బలు వేసి దారి మూసేసిన విషయంపై రెడ్డి శేఖర్ వర్గీయులను నిలదీయగా ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన వెంకటరమణను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.