VIDEO: పర్యావరణ దినోత్సవాల క్యాలెండర్ ఆవిష్కరణ
VSP: విద్యార్థుల్లో పర్యావరణ అవగాహన పెంపొందించేందుకు గ్రీన్ క్లైమేట్ టీం ఎన్‌జీవో రూపొందించిన పర్యావరణ దినోత్సవాల కాలమాని (క్యాలెండర్)-2026ను అనకాపల్లి జిల్లా ఉద్యానవనాల శాఖ అధికారి ఏ.రాజశేఖరం మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర ప్రకృతి ఆధారంగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు పెంచాలని పిలుపునిచ్చారు.