పార్టీలకు అతీతంగా సంతకాల సేకరణ: మాజీ మంత్రి కారుమూరి
W.G: మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు పార్టీలకు అతీతంగా సంతకాల సేకరణ జరిగిందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. సోమవారం తణుకు నుంచి భీమవరం వెళ్లి అక్కడ నుంచి సంతకాల ప్రతులను తీసుకుని మంగళగిరి వెళ్లే ర్యాలీను ఆయన ప్రారంభించి మాట్లాడారు.