విఘ్నేశ్వరుని ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం

కోనసీమ: అయినవిల్లి మండలంలోని అయినవిల్లి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సన్నిధిలో గురువారం వైశాఖ మాసం మాసం శుక్ల ఏకాదశి సందర్భంగా పలువురు చిన్నారులు అక్షరాభ్యాసం చేశారు. చదువుల తల్లి సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సామూహిక అక్షరాభ్యాసంతోపాటు నామకరణం కార్యక్రమాలు జరిగాయి. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.