చర్ల ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్

చర్ల ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్

BDK: కలెక్టర్ జితేష్ వీ.పాటిల్ బుధవారం చర్ల మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. ఇందులో భాగంగా చర్లలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. గురువారం జరగనున్న పోలింగ్ నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు మండల అధికారులు పాల్గొన్నారు.