కల్తీ కల్లుపై టీజీ న్యాబ్ వినూత్న కార్యక్రమం

కల్తీ కల్లుపై టీజీ న్యాబ్ వినూత్న కార్యక్రమం

TG: కల్తీ కల్లుపై అవగాహన కల్పించేందుకు టీజీ న్యాబ్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఇటీవల కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కారణంగా 83 మంది బాధితులు ఆస్పత్రి పాలైయ్యారు. ఈ క్రమంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 26 బృందాలను టీజీ న్యాబ్ ఏర్పాటు చేసింది. నిజామాబాద్ జిల్లాలోని 104 గ్రామాల్లో అవగాహన కల్పించడానికి 26 బృందాలు ఏర్పడగా.. ఒక్కో బృందం 4 గ్రామాల్లో అవగాహన కల్పించనున్నాయి.