ఆత్మకూరు అర్బన్ సీఐ రాముకు గౌరవ సత్కారం
NDL: ఆత్మకూరు అర్బన్ సీఐ రాముకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇవాళ గౌరవ సత్కారం లభించింది. తుఫాన్ సమయంలో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన సీఐ రాముకు గౌరవ జ్ఞాపికను అందజేశారు. అనంతరం వరద ప్రాంతాల్లో ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేసినందుకు సీఐ రామును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు.