ఇసుక అక్రమాలపై కూటమి నేతల ఫిర్యాదు
తూ.గో: తాళ్లపూడి మండలం తాడిపూడిలో ఇసుక ర్యాంపుపై చర్యలు తీసుకోవాలని కూటమి నాయకులు శుక్రవారం తహసీల్దార్ లక్ష్మీ లావణ్యకు ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లాకి కేటాయించిన ఈ ఇసుక ర్యాంపులో నిబంధనల విరుద్ధంగా ఇసుక తవ్వకాలు, రవాణా చేస్తున్నారన్నారు. తాళ్లపూడి మాజీ ఎంపీటీసీ సభ్యుడు పెదపాటి కృష్ణమోహన్, జనసేన పార్టీ కార్యదర్శి చెవ్వూరి నాని ఫిర్యాదు చేశారు.