'చిరంజీవి చేయలేకపోయారు.. చరణ్ చేశారు'

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌పై దర్శకుడు రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'చిరుకి నేను వీరాభిమానిని. ఆయన కొదమసింహం సినిమాను చూశాను. అందులో ఇసుకలో పాతిపెట్టిన చిరును గుర్రం కాపాడుతుంది. ఆ గుర్రానికి ఆయన థ్యాంక్స్ చెప్పకపోవడంతో నేను నిరుత్సాహపడ్డాను. అందుకే 'మగధీర'లో అలాంటి సీన్‌లో చరణ్ గుర్రాన్ని కౌగలించుకుని కృతజ్ఞతా భావంతో మాట్లాడేలా తీశాను' అని తెలిపారు.