VIDEO: ఊరిలో నీరు కరువాయె.. పంటపొలాలు దిక్కాయే
KMR: వేసవి కాలం ప్రారంభం కాకముందే పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి మొదలైంది. శనివారం బీర్కూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన పలువురు పంట పొలాల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. 2 రోజులుగా నీరు సరఫరా కాకపోవడంతో పొలాల నుంచి నీటిని తీసుకెళ్తున్నామని ప్రజలు తెలిపారు. బోరు మోటర్లు కాలిపోయాయని, వెంటనే సమస్యను పరిష్కరిచలన్నారు.