వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించి హెల్త్ సూపర్వైజర్

వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించి హెల్త్ సూపర్వైజర్

KMR: ఎర్ర పహాడ్ PHC పరిధిలోనీ చందాపూర్ గ్రామంలో వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియను శనివారం హెల్త్ సూపర్వైజర్ సుభాషిణి పరిశీలించారు. చిన్న పిల్లలకు అందిస్తున్న టీకాలపై సిబ్బందిని అడిగి వివరాలు సేకరించారు. వ్యాక్సినేషన్ క్రమ పద్ధతిలో వేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఏఎన్ఎం, ఆశాలకు సూచించారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు.