పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ దేశాలు చమురు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో చమురు నిల్వలు తగ్గడంతో నేపాల్ ప్రభుత్వం ఇంధన ధరలను మరోసారి పెంచింది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ.15 చొప్పున పెంచినట్లు ప్రకటించింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.187, డీజిల్ ధర రూ.167కు చేరింది. పెంచిన ధరలు అర్థరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి.