కత్తిమీద సాములా పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి

రంగారెడ్డి జిల్లాలో 526 గ్రామపంచాయతీలకుగానూ 458మంది పంచాయతీ కార్యదర్శులున్నారు. వీరిలో 40 మందికి అదనపు బాధ్యతలు అప్పగించారు. గ్రామపంచాయతీలకు గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు సర్కారు ఒక్కపైసా చెల్లించలేదని వారు చెబుతున్నారు. కార్యదర్శులే అప్పులు చేసి గ్రామ పంచాయతీల నిర్వహణ బాధ్యతలను భుజాలపై వేసుకున్నారు. చేసిన అప్పులు తీర్చలేక మనోవేదనకు గురవుతున్నామని వాపోయారు.