పెట్రోల్ బంకు యాజమానులతో సమావేశం
PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో ఉన్న పెట్రోల్ బంకు యాజమానులతో టౌన్ సీఐ వెంకటరావు సోమవారం సమావేశం నిర్వహించారు. వాహనదారులు పెట్రోల్ కు వచ్చినప్పుడు సామరస్యంగా మాట్లాడుతూ విధిగా శిరస్త్రాణం ధరించేలా అవగాహన కల్పించాలని సూచించారు. బంకు పరిసరాలలో భద్రత ప్రమాణాలు పాటిస్తూ, సీసీ కెమెరాలు మొత్తం కవర్ అయ్యేలా చూడాలన్నారు.