కలెక్టర్ కార్యాలయం ముందు సీఐటీయూ ధర్నా

కలెక్టర్ కార్యాలయం ముందు సీఐటీయూ ధర్నా

SRD: నాలుగు లేబర్ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలకు నిరసనగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం నోటిఫికేషన్ ప్రత్తులను దహనం చేశారు. జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ.. 29 లేబర్ చట్టాలు రద్దుచేసి నాలుగు లేబర్ చట్టాలు తీసుకురావడం సరికాదని చెప్పారు. ఈ ధర్నాలో నాయకులు మాణిక్యంతో పాటు తదితరులు పాల్గొన్నారు.