గవర్నర్ల అధికారాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

గవర్నర్లకు ఉండే అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం, గవర్నర్లకు బిల్లులను నిలిపివేసే అధికారం ఉంటే, అది మనీ బిల్లులకు కూడా వర్తిస్తుందని అభిప్రాయపడింది. ఇది సమస్యాత్మకమని, గవర్నర్లు తమ వీటో అధికారంతో సాధారణ బిల్లులతో పాటు మనీ బిల్లులను కూడా అడ్డుకోవచ్చని సుప్రీం స్పష్టం చేసింది. ఈ విషయంపై కోర్టు సుదీర్ఘంగా విచారణ చేపట్టింది.