ఘనంగా నగర సంకీర్తన... తన్మయత్వంలో భక్తులు

TPT: తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తి భావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ అన్నారు. శనివారం భజన మండలి కళాకారులు గోవిందరాజు స్వామి ఆలయం నుంచి నాలుగు మాడ వీధుల్లో నగర సంకీర్తన చేశారు. గోపీనాథ్ మాట్లాడుతూ.. శ్రీవారి దయ వల్లే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.