ఆ ఘటన తీవ్ర వేదనకు గురిచేసింది: దర్శకుడు
దివంగత నటి శ్రీదేవి లాంటి చావు మరెవరికీ రావొద్దు అని దర్శకుడు రాఘవేంద్రరావు ఆవేదన వ్యక్తం చేశాడు. 'శ్రీదేవి లాంటి హీరోయిన్ మరొకరు లేరు. అలాంటి ఆమె దుబాయ్‌లోని ఒక హోటల్ బాత్ టబ్‌లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించడం చాలా దారుణం. ఆమె మరణం నన్ను తీవ్ర వేదనకు గురిచేసింది. అంతటి గొప్ప నటి, ఇండస్ట్రీకి ఎంతో సేవ చేసిన అతిలోక సుందరి అలా వెళ్లిపోకూడదు' అని అన్నాడు.