కూసుమంచిలో వీధి కుక్కల బెడద

KMM: కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువైందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో పదుల సంఖ్యలో కుక్కలు గుంపులుగా తిరుగుతూ బైకర్లు, స్కూల్ పిల్లలపై దాడికి యత్నిస్తున్నాయి. నరసింహులగూడెంలో ఓ బైక్ వెనుక కుక్కలు పడటంతో వాహనదారుడు గాయాలపాలయ్యాడు. పాలేరులో స్కూల్ పిల్లలపై కుక్కలు వెంటపడటంతో విద్యార్థులు భయపడి పరుగులు తీశారు.