ఘనంగా దుర్గాదేవి ప్రతిష్టాపన కార్యక్రమం

పెద్దపల్లి: రామగుండం సింగరేణి సంస్థలో సివిల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో దుర్గాదేవి ఆలయంలో దుర్గమ్మ విగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా GM చింతల శ్రీనివాస్ లక్ష్మి అధికారులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్మిక కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.