సీఎంను కలిసిన ఎమ్మెల్యే పుట్టా
KDP: సీఎం చంద్రబాబును అమరావతిలోని సెక్రటేరియట్ కార్యాలయంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠంలో అసైన్డ్ భూముల గురించి వివరించారు. ప్రభుత్వ భూములు ఎక్కువగా ఆక్రమణకు గురయ్యాయని అసైన్మెంట్ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుని పేదలకు భూ పంపిణీ చేపట్టాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.