సోమవారం ప్రజావాణి రద్దు: కలెక్టర్
ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ రాజర్షి షా శనివారం తెలియజేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేసినట్లు వెల్లడించారు. కోడ్ ముగిసిన వెంటనే ప్రజావాణిని తిరిగి యథావిధిగా పునఃప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు.