VIDEO: అరటి గెలలతో కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా

VIDEO: అరటి గెలలతో కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా

ATP: గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురం కలెక్టరేట్ వద్ద అరటి రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి శైలజానాథ్ ఆధ్వర్యంలో జేఎన్టీయూ ఓటీఆర్‌ఐ నుంచి కలెక్టరేట్ వరకు అరటి గెలలతో నిరసన ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.