చమురు ధరలపై అమెరికా కీలక ప్రకటన

చమురు ధరలపై అమెరికా కీలక ప్రకటన

చమురు ధరలపై అమెరికా అప్రమత్తమైంది. చమురు ధరలు అదుపు చేయడానికి అన్ని విధాల యత్నిస్తున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. చమురు ధరలు పెరగడం తాత్కాలికమేనని వెల్లడించింది. గ్లోబల్ మార్కెట్‌లో చమురు సరఫరాను స్థిరంగా ఉంచేందుకు, రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడానికి భారత్‌కు 30 రోజుల పాటు అమెరికా తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. దీంతో ధరల భారం కొంత తగ్గే అవకాశం ఉంది.