ఆదోనిలో సినీ హీరో ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు
KRNL: సినీ హీరో ప్రభాస్ 46వ పుట్టినరోజు సందర్భంగా ఆదోనిలో అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో బాలింతలకు బ్రెడ్లు, పాలు పంపిణీ చేశారు. తదనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనాథలను, నిరుపేదలను ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో ప్రభాస్ ఎల్లప్పుడూ ముందు ఉంటారని ఫ్యాన్స్ పేర్కొన్నారు.