స్మార్ట్ రేషన్ కార్డులు..4 రోజుల్లో గడువు
KDP: గ్రామ వార్డు సచివాలయాల నుంచి క్యూఆర్ కోడ్ తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను ఫ్రీగా తీసుకోవడానికి ఈనెల 15 వరకే గడువుంది. ఆ తర్వాత మిగిలిన కార్డులను కమిషన్ రేటుకు పంపుతారు. అప్పటికి తీసుకొని వాళ్ళు సచివాలయాల్లో రూ. 200 చెల్లించి పూర్తి అడ్రస్సుతో దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఇంటికే పంపిస్తామని అధికారులు తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.