కుట్టు మిషన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
W.G: నరసాపురం మండలం వేములదీవి గ్రామంలో డెవలప్మెంట్ కమిషనర్ టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ అపిటికో లిమిటెడ్, హైదరాబాద్ ఆధ్వర్యంలో మొత్తం 32 కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందన్నారు.